(రంగారెడ్డి జిల్లా ఆవిర్భావదినం సందర్భంగా) - రంగారెడ్డి జిల్లా ఎప్పుడు ఏర్పడింది--ఆగస్టు 15, 1978.
- రంగారెడ్డి జిల్లా ఏర్పడక ముందు ఈ ప్రాంతం ఏ జిల్లాలో భాగంగా ఉండేది--హైదరాబాదు జిల్లా.
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు--మర్రి చెన్నారెడ్డి.
- రంగారెడ్డి జిల్లా పేరు ఎవరి పేరుమీదుగా పెట్టబడినది--కొండా వెంకట రంగారెడ్డి (మర్రి చెన్నారెడ్డి మామ).
- భౌగోళికంగా నలువైపులా రంగారెడ్డి జిల్లాచే చుట్టబడిన జిల్లా--హైదరాబాదు జిల్లా.
- రంగారెడ్డి జిల్లాలో మూసీనది జన్మస్థానమైన కొండలు--అనంతగిరి కొండలు.
- రంగారెడ్డి జిల్లా లోని పురపాలక సంఘాలు--2 (తాండూరు, వికారాబాదు).
- ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి శాటిలైట్ పట్టణంగా ఏర్పాటుచేయనున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన పట్టణం--వికారాబాదు.
- వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రంగారెడ్డి జిల్లాకు చెందిన పట్టణం--చేవెళ్ళ.
- రంగారెడ్డి జిల్లాలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ప్రాంతం--శంషాబాద్.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.