- స్వాతంత్ర్యమే నా జన్మ హక్కు అని నినదించినది--బాలగంగాధర తిలక్.
- "ట్రిస్ట్ విత్ డెస్టిని" అని జవహర్‌లాల్ నెహ్రూ ఎప్పుడు పలికినాడు--స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు.
- స్వాతంత్ర్యం కోసం జరిపిన పోరాటంలో గాంధీజీ ప్రధాన ఆయుధం--సత్యాగ్రహం.
- సంపూర్ణ స్వరాజ్యం ప్రసాదించాలని భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో తీర్మానించింది--1929 లాహోర్ సమావేశం.
- 1947లో స్వాతంత్ర్యం లభించేనాటికి దేశంలో ఉన్న సంస్థానాల సంఖ్య--562.
- తండ్రిపేరు స్వరాజ్యం, ఇంటిపేరు జైలు అని ప్రకటించుకున్న స్వాతంత్ర్యోద్యమ నాయకుడు--చంద్రశేఖర్ ఆజాద్.
- 13 సం.లు జైలులో ఉండి స్వాతంత్ర్యం అనంతరం విడుదలైన మణిపూర్ రాణి--రాణి గైడిన్లు.
- స్వాతంత్ర్యసమరయోధులను నిర్బంధించడానికి అండమాన్ దీవులలో బ్రిటీష్‌వారు నిర్మించిన జైలు--కాలాపానీ.
- భారత స్వాతంత్ర్యం తరువాత కూడా పోర్చుగీసువారు ఆధిపత్యం చెలాయించిన ప్రాంతాలు--గోవా, డామన్, దీవు.
- స్వాతంత్ర్యం సిద్ధించిన ఆగస్టు 15వ తేదీనే జన్మించి (1872లో) మొదట అతివాదిగా ఉండి తరువాత సాధువుగా మారినది--అరవిందఘోష్.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.