- అలహాబాదు హైకోర్టు ఎందువల్ల వార్తల్లోకి వచ్చినది--సెప్టెంబరు 30న అయోధ్య కేసులో తీర్పు ప్రకటించింది.
- అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన త్రిసభ్య బెంజీ న్యాయమూర్తులు--సుధీర్ అగర్వాల్, డి.వి.శర్మ, ఎస్.యు.ఖాన్.
- అలహాబాదు హైకోర్టు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది--ఉత్తరప్రదేశ్.
- అలహాబాదు హైకోర్టు ఏ సంవత్సరంలో స్థాపించబడినది--1866లో (వాయువ్య ప్రావిన్స్ హైకోర్టు పేరుతో).
- 1866లో వాయువ్య ప్రావిన్సు హైకోర్టు స్థాపన సమయంలో ప్రధాన స్థావరం--ఆగ్రా.
- హైకోర్టు ప్రధాన స్థావరాన్ని అలహాబాదుకు ఎప్పుడు మార్పు చేశారు--1869.
- 1948లో అలహాబాదు హైకోర్టులో విలీనమైన చీఫ్ కోర్టు--ఔధ్ చీఫ్ కోర్టు.
- అలహాబాదు హైకోర్టు శాశ్వత బెంచి ఎక్కడ కలదు--లక్నో.
- అలహాబాదు హైకోర్టు మొట్టమొదటి ప్రధాన \న్యాయమూర్తి--వాల్టర్ మోర్గాన్.
- 1975లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదని తీర్పు ఇచ్చిన అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తి--జస్టిస్ జగ్‌మోహన్ లాల్ సిన్హా.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి