ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 మే, 2012

కామెంటుకు సమాధానం

RameshMay 4, 2012 07:34 PM 
(హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది)

CCKరావు గారు నేనొక విషయం మిమ్మల్ని సూటిగా అడుగాలనుకుంటున్నాను YES/NO రెండే మాటల్లో చెప్పండి. మీబ్లాగ్‌లో ప్రచురించే ప్రతి విషయం ఎక్కడ చదవకుండా,సేకరించకుండా మీరే స్వంతంగా తయారు చేస్తున్నారా? YES/NO

మీరడిగే ప్రశ్నకు ఆబ్జెక్టివ్ తరహాలో సమాధానం ఇవ్వలేను అది చాలా పెద్ద సమాధానం అవుతుంది. నా బ్లాగు నుంచి కాపీ చేయాలని ఎందుకనుకుంటున్నారు? వార్తల కోసం టివి, పత్రికలు, మిగితా సమాచారం కోసం వికీపీడియాలనుంచి సమాచారం గ్రహిస్తాను.(మక్కికిమక్కి మాత్రం కాదు) ఇది మొత్తం నాదైన శైలిలోనే తయారుచేస్తున్నాను. విజ్ఞాన సమాచారం అనేది ఎవరూ సొంతంగా తయారుచేయలేరు అదే సమయంలో ఏ ఒక్క వనరు నుంచి మక్కికిమక్కి చేయడం కూడా తప్పు. పీహెచ్‌డి కోసం పరిశోధనలు చేసి డిగ్రీ పొందేవారు కూడా అనేక వనరుల నుంచి సమాచారం సేకరిస్తారనేది అందరికీ తెలుసు. అందుకే ఒక నానుడి పుట్టింది "ఒక గ్రంథం నుంచి చూసి వ్రాస్తే కాపీ, అనేక గ్రంథాల నుంచి కొన్నికొన్ని వాక్యాలు పొందుపరిస్తే అది పరిశోధన అని" నిజమే కదా! ఎక్కడా చూడకుండా విజ్ఞాన విషయాలు వ్రాస్తేనే కాపీచేయరాదని, అలా కాకుంటే ఎవరైనా కాపిచేయవచ్చుననీ అనుకుంటే కాపీరైట్ చట్టాలెందుకూ? మానవులంతా కొత్త విషయాలు కనిపెట్టే శాస్త్రజ్ఞులు కాదుకదా! పది వనరుల నుంచి సేకరించి మరికొన్ని సొంతంగా జోడించి మనదైన శైలిలో వ్రాయడం అందరూ చేసేపనే కదా! ఒకరు చేసే పనికి మరొకరు సునాయాసంగా మక్కికిమక్కి కాపీ చేస్తే విజ్ఞానం ఎటుపోతుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం ఉందా? చరిత్ర పుస్తకాలు వ్రాసేవారు కూడా కాపీరైట్ హక్కులు పొందుతారనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలు. మరో విషయం కూడా చెబుతాను - వికీపీడియా గురించి వివరిస్తారు. వికీపీడియాలో రచనలు చేసేవారు ఎక్కడి నుంచి కాపీచేయరాదనే నిబంధన ఉంది. అదే సమయంలో సొంత అభిప్రాయాలు కూడా రాయరాదనే నిబంధనా ఉంది. దీని అర్థం గ్రహించారా? అంటే ఎక్కడి నుంచి ఉన్నది ఉన్నట్లుగా కాపీచేయకుండా అదే సమయంలో మన అభిప్రాయాలు జోడించక వ్యాసాలు వ్రాయాలన్నమాట. కాపీరైట్ చట్టాలు కూడా దీనికి అంగీకరిస్తాయి. మరి ఇదెలా సాధ్యం అనుకోవచ్చు. నేను పైన చెప్పినదీ అదే విషయం. దీని గురించి ఇంకనూ ఎంతైనా చెప్పవచ్చు కాని పై కొన్ని వాక్యాలవల్ల నా అభిప్రాయం అర్థం చేసుకుంటే చాలు. చివరగా ఒక మాట మార్కెట్‌లో లభ్యమయ్యే పోటీపరీక్షల పుస్తకాల నుంచి ప్రశ్నలను కాపీచేసి ప్రచురించి ఆ తర్వాతి పరిణామాలు చూడండి. మీ అభిప్రాయం ప్రకారం శాస్త్రజ్ఞులు, పరిశోధకులు తప్ప మరెవరూ ఏది వ్రాసిననూ అది ఎవరైనా కాపీ చేసుకోవచ్చు. కాని దీన్ని ఎవరూ హర్షించరు. కేవలం సేకరించిన (వివిధ వనరుల నుంచి) విషయాలకు కూడా కాపీరైట్ హక్కులుంటాయనే విషయాన్ని కూడా గ్రహించండి.

8 కామెంట్‌లు:

  1. గాజుల సత్యనారాయణ గారి పెద్ద బాలశిక్ష మీరు చూసే ఉంటారు . వేమన శతకం తో పాటు అనేక శతకాలు , చిన్నప్పుడు మనం విన్న కథలు అన్నీ అందులో ఉన్నాయి . చాలా శ్రమకోర్చి సేకరించారు . తక్కువ ధరకు ఆ పుస్తకాన్ని అమ్ముతున్నారు అందుకు అభినందనలు . కానీ ఆ బుక్ లో కాపి రైట్ గురించి అతని హెచ్చరిక నవ్వు తెప్పిస్తుంది . ఆ పుస్తకం లోని సమాచారం తనదని కాపి రైట్ వర్తిస్తుందని రాశారు. అందు లో నుండి ఏ సమాచారం ఉపయోగించు కోవద్దని హెచ్చ రించారు నేను చదివినంత వరకు అందులో ఆయన సొంతంగా రాసింది ఎమీ లేదు . వేమన కవిత్వం పై గాజుల సత్యనారాయణకు కాపి రైట్ ఏమిటో ? అలానే ఇక్కడ వీరు రాసిన విధానం, మొత్తం సమాచారం మక్కికి మక్కి కాపి చేయడం కాపి రైట్ ఉల్లంగనే అవుతుంది . మన దేశం లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎప్పుడూ స్వతంత్రం వచ్చింది అనేవి ఎవరు రాసినా అవే రాయాలి . అలాంటివి కాపి కొట్టారని చెప్పలేం కానీ నిజంగా కాపి కొడితే గుర్తు పట్టడం, నిరూపించడం కష్ట మేమి కాదు

    రిప్లయితొలగించండి
  2. అవునండీ మురళి గారు, చెప్పినది నిజమే. గాజుల సత్యనారాయణ గారి పెద్దబాలశిక్షలో అధికభాగం సేకరణలే. వాటితో పాటు ఎప్పటికప్పుడు తాజాకరణచేసే విషయాలుంటాయి. సేకరణలకు కూడా కాపీరైట్ హక్కులుంటాయని నేను చెప్పాను కదా. కాపీరైట్ లభించందంటే కాపీరైట్ చట్టాలూ దానికి అంగీకరిస్తున్నాయన్నమాట నిజమే కదా. వేమన పద్యాలపై అతనికి కాపీరైట్ లేకపోవచ్చు కాని ప్రతి పద్యానికి భావార్థం ఇచ్చిన విషయం మాత్రం గుర్తించుకోవాలి. కాబట్టి ప్రతి పద్యం భావార్థంతో సహా కాపిచేయకూడదని అర్థం. అలాగే కథలు కూడా భావం ఒకే విధంగా ఉన్నను వాక్యాల అమరికలో తేడాలున్న విషయం గమనించే ఉంటారు. మీరు చెప్పినట్లు చాలా విషయాలు ఎవరు వ్రాసిననూ అదే వ్రాయాల్సి ఉంటుంది. భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య ఎక్కడో ఉన్నట్లుగా వ్రాస్తే కాపీచేసినట్లవుతుందని ఏదో 30 లేక 40 అని వ్రాస్తే నవ్వులపాలవుతాం కదా. వాటిని అదే విధంగా వ్రాసిననూ కాపీచేశారని కాదు కాని మక్కికిమక్కి అన్ని విషయాలు వ్రాస్తే మాత్రం (అంటే మీరన్నట్లు నిరూపించదగనిగా ఉంటే మాత్రం) కాపీచేసినట్లు. ఆంధ్రప్రభ పత్రిక వారు నా బ్లాగు నుంచి మక్కికిమక్కి కాపీచేసిన విషయం ఇంకనూ వివాదంలో ఉంది. నా బ్లాగులో వ్రాసే ప్రతి విషయంపై నాకు హక్కు ఉంది. నా అనుమతి లేకుండా కాపీచేయడానికి ఎవరికీ హక్కులేదు. పత్రికలవారు కూడా దీనిని విస్మరించడం వివాదంలో కూరుకుపోవడం దారుణమైన విషయం కదా. చరిత్ర పరిశోధకులు కూడా ఎన్నో చారిత్రక గ్రంథాలు పరిశీలించి చరిత్రపై వ్యాసాలు వ్రాస్తుంటారు. వారు కొత్తగా కనిపెట్టేది ఏమీకాకున్ననూ అనేక చారిత్రక గ్రంథాలు పరిశీలించి భావాన్ని గ్రహించి తమదైన శైలిలో పుస్తకాలు రచించి కాపీరైట్ హక్కులు పొదుతారు. వారిశ్రమకు మరెవరో యధాతథంగా కాపీచేయకుండా కాపీరైట్ హక్కులు కాపాడతాయి. ఈ విషయాలన్నీ మనం గుర్తించుకోవాల్సిందే. ఈ రోజుల్లో చాలామంది ఎలాంటి శ్రమ, ఓపిక లేకుండా ఒకరి కష్టానికి తగ్గ ప్రతిఫలం, గుర్తింపు ఇవ్వకుండా కాపీ చేస్తూ వివాదంలో కూరుకుపోతున్నారు. కాబట్టి ఒకరు రచించిన విషయాన్ని కాపీచేసేముందు ఈ విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమే నండి ఇదివరకే ఉన్న విషయాన్ని ఉపయోగించి ఒక కొత్త వ్యాసాన్ని రూపొందిస్తే ఆ వ్యాసాన్ని రచయిత అనుమతి లేకుండా మక్కికి మక్కిగా కాపీ చేయడం క్షమించరాని నేరం. వ్యాస రచయితకు చర్యలు తీసుకునే సంపూర్ణ హక్కులు కలిగి ఉంటాయి, కాని ఆ వ్యాసంలో వ్యస కర్త స్వంతం కాని విషయాలను ఇతలులు వాడుకోవచ్చనే నా ఉద్దేశ్యం.

      తొలగించండి
  3. రావు గారు కాపీ కొట్టడం అంటే ఏమిటీ? ఉదహరణకు నిన్న జైల్ సింగ్ గారి గురించి రాశారు, మీరు జైల్ సింగ్ గారి గురించిన కాంటేంట్ ప్రప్రథమంగా మీరే రాశారా? ఇంతకు ముందు ఇతరులు రాయ లేదా?ఇతరులు రాసిన దాన్ని మీరు రాస్తే కాపీ రైట్ కిందకు రాదా?!! మీరు రాసిన తరువాత ఎవరు జైల్ సింగ్ గారి గురించి రాసిన మీరు రాసినవే వస్తాయి, మీమాటల ప్రకారం అవి కాపి కిందకే వస్తాయి కదా? మరి అలాంటప్పుడు ఇతరులు ఎలారాయాలి? మీరు రాసిన నిజమైనా విషయాలను అంటే తేదీలు వగైరాల లాంటీవి ఇతరులు మార్చి రాయాలా? కాపీ రైట్ అంటే స్వంత రచనలకు వర్తిస్తుంది,కాని ఇదివరకే ప్రపంచంలో నలుగుతున్న, సమాజంలో ఉన్న విషయాలను మీరు మళ్లీ రాస్తూ ఇది నా స్వంత రచన ఈ కాంటేంట్ ను ఎవరు వాడుకోవద్దు అంటే అర్థమేమిటో బోదపడంలేదు పైగా నవ్వు తెప్పిస్తుంది.

    రావు గారు ఒక్క జైల్ సింగ్ గారి గురించే కాదండి జనరల్ నాలేడ్జికి సంబందించి ఎవరికి కాపీరైట్ హక్కులు ఉండవు, ఎవరైన హక్కులు ఉంటాయని బావించిన అది మూర్ఖత్వమే అవుతుంది. నా రచనల్లో "అమ్మ" అనే పదాన్ని ఉపయోగించి కాపిరైట్ ప్రకారం ఇతరులు "అమ్మ" అనే పదాన్ని ఉపయోగించ వద్దని నేనంటే మీరెమంటారు? ఏం జరుగుతుందండి. తెలుగు అక్షరాలు అ నుండి ఱ వరకు నేను నా బ్లాగు లో రాసి కాపీ రైట్ ప్రకారం ఈ అక్షరాలను ఇదే వరుస క్రమంలో కాని లేదా ఏ విదంగానైనా ఎవరు ఉపయోగించిన దోషులే అంటే ఎలా ఉంటుందండి? అలా ఉంది మీ కాపీ రైట్ వాదన!!

    ఏది ఏమైన మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.

    రిప్లయితొలగించండి
  4. రమేష్ గారు, జైల్ సింగ్ గురించి వ్రాసిన విషయాలు నా స్వంతం కాదు ఆ విషయం ముందే చెప్పానుగా! కాని అనేక వనరుల నుంచి సేకరించిన సమాచారం ఒక పద్దతిలో నాదైన శైలిలో వ్రాసి సమాచారం సిద్ధం చేశాను. అలా నేను తయారుచేసిన సమాచారం మక్కికిమక్కి ఎలా కాపీచేయవచ్చండి. ఇదివరకు మరళిగారు ఒక కామెంట్ వ్రాసి గాజుల సత్యనారాయణ గారి ఉదాహరణ ఇచ్చారు చూడండి. గాజుల సత్యనారాయణ గారి పెద్ద బాలశిక్షలో అధికభాగం సేకరణలే. అయిననూ కాపీరైట్ పొందారు. ఒకవేళ ఇలాంటి సేకరణలకు కాపీరైట్ లేదనే అనుకుందాం. ఎంతో కష్టపడి, ఎన్నో సంవత్సరాలపాటు శోధించి, సేకరించిన సమాచారం మరెవరో పూర్తిగా మక్కికిమక్కి కాపీచేసి గంటలవ్యవధిలో ప్రింటుచేసి మార్కెట్‌లో అమ్మే అవకాశం ఉంటుంది. మరి ఇలా చేయడం న్యాయమేనా? కష్టపడ్డవారికి చివరికి మిగిలేది ఏమిటి? అందరూ ఇలా కాపీచేస్తే విజ్ఞానం ఇంతటితో ఆగిపోతుంది. జైల్ సింగ్ గురించిన విషయాలు నేను ఎవరివద్దయినా కాపీచేసినట్లు నా పై ఫిర్యాదు వస్తే దానికి నేను సమాధానం చెబుతాను. నేను ఎవరివద్ద నుంచి కూడా యధాతథంగా కాపి చేయడం లేదు కాబట్టి నాకు ఆ భయం లేదు. అదే సమయంలో నా సమాచారం కూడా ఎవరూ కాపిచేయరాదని హెచ్చరిస్తున్నాను. జైల్ సింగ్ లాంటి సమాచారం వికీపీడియా లాంటి స్వేచ్ఛావిజ్ఞాన సర్వస్వాల నుంచి ఎవరైనా తయారుచేసుకోవచ్చు కదండీ. పత్రికల వారుసైతం వికీపీడియాలపై ఆధారపడతారు. తెలుగు వికీపీడీయాలో నేను రాసిన అనేక వ్యాసాలు (కొన్ని మక్కికిమక్కి) పత్రికలలో ప్రచురితమైనాయి. అది స్వేచ్ఛావిజ్ఞానసర్వస్వం కాబట్టి ఏమీ చెప్పలేము, కాకుంటే ఫలానా చోటు నుంచి తీసుకున్నాము అని పెట్టడం మంచిది (వికీపీడియా కూడా ఇదే చెబుతుంది).

    రిప్లయితొలగించండి
  5. ఈ విషయాలు (జైల్ సింగ్) నేనే స్వయంగా తయారుచేశాను. ఇదివరకు ఎక్కడా లేవు అని నేను చెప్పడం లేదు. కొన్ని పోస్టులకు సంబంధించి మాత్రం స్వయంగా తయారుచేశాను. అవి ఎక్కడా ఎవరునూ ప్రచురించలేరు కూడా. ఈ విషయాలు (ఉదా: జైల్ సింగ్ నా స్వంతం కాకున్నా వాక్యాలను రూపుదిద్దినది మాత్రం నేనే కాబట్టి ఆ వాక్యాలపై నాకు పూర్తి అధికారం ఉంది. నేను ఎవరివద్ద నుంచీ మక్కికిమక్కి చేయడం లేదు కాబట్టి వనరులు ఇచ్చే అవసరం కూడా లేదు. కాపీరైట్ చట్టాలకు లోబడి మాత్రమే నేను విషయాలు తయారుచేస్తున్నాను. దీనికై మీరు పెద్ద మాటలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. నా అనుమతి లేకుండా మక్కికిమక్కి కాపిచేసిన వారే దొంగలతో సమానం అని ఏనాడో చెప్పాను. జైల్ సింగ్ ముఖ్యమంత్రిగా పనిచేసినది 1972లోనే, 1982లో రాష్ట్రపతి అయ్యారు. పొరపాటును సరిదిద్దాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  6. ఒక వ్యక్తి గురించి కేవలం పది పాయింట్లే ఉండవు. వందా, రెండువందల పాయింట్లు కూడా తయారుచేయవచ్చు. (మహాత్మాగాంధీపై మా వద్ద 400 పాయింట్లు ఉన్నాయి). జైల్ సింగ్ పోస్టులోని కొన్ని వాక్యాలు తీసుకొని (అంటే పుట్టిన తేది, మరణించిన తేది, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి అయిన సం.లు) మరికొన్ని వనరుల నుంచీ సమాచారం సేకరించి మీరు కొత్తగా వ్యాసం తయారుచేయండి. నాకేమీ అభ్యంతరం లేదు. అంతేకాని మక్కికిమక్కిగా నాదైన శైలిలో తయారుచేస్తున్న సమాచారం కాపీచేయరాదనేదే నేను చెప్పేది. నేను ఇక్కడ ఉపయోగించిన పాయింట్లు మరెవరూ ఉపయోగించరాదని నేను చెప్పడం లేదు. నేను మొదటినుంచి చెబుతున్నది మక్కికిమక్కి కాపీచేయరాదనే విషయాన్నే. ఆంధ్రప్రభ పత్రికలో పూర్తిగా మక్కికిమక్కి కాపీచేసిన విషయాన్నే నేను అభ్యంతరపరుస్తున్నాను.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,