ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 మార్చి, 2012

ఎవరు నవ్వుల పాలయ్యారు?

ఒకప్పుడు ప్రముఖ పత్రికగా వెలిగిన పత్రిక వారు కూడా ఇప్పుడు ఇలాంటి చిల్లర పనులు చేస్తూ, చివరికి బ్లాగుల నుంచి కూడా సమాచారం దొంగలిస్తూ ఉంటే పెట్టిన హెచ్చరికలను తీసెయ్యాలని లేకుంటే మూర్ఖత్వానికి అందరూ నవ్వుకుంటారని ఎవరయ్యా నాకు చెప్పేది? కామెంట్ రాసేటప్పుడు కనీసం పేరు, ఊరు రాయడం కూడా తెలియదా? ఇప్పటివరకు ఎవరు నవ్వుల పాలయ్యారో అందరికీ తెలుస్తూనే ఉంది. హెచ్చరికలు పెట్టినందుకు నా పరువు పోతుందని మాట్లాడడం మూర్ఖత్వమే తప్ప మరేమి కాదు! మూడు చోట్ల కాదు వంద చోట్లా హెచ్చరికలు పెడతాను. నాకు సహృదయంతో ఉన్న పాఠకులే దేవుళ్ళు, కాపీరాయుళ్ళు రాక్షసులు. వికీపీడియా గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అది స్వేచ్ఛా విజ్ఞానసర్వస్వము అయీననూ అచ్చటి నుంచి కాపిచేసిననూ "వికీపీడియా సౌజన్యం" అని వ్రాయాల్సి ఉంటుంది. బొమ్మలకైతే అప్లోడ్ చేసిన వారిపేరు కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. వికీపీడియా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అందులోని సమాచారం ఎవరైనా చేర్చవచ్చు, ఉన్న సమాచారాన్ని మార్చవచ్చు, సమాచారం ఎవరైనా కాపీచేసుకోవచ్చు, ప్రచురించుకోవచ్చు, అమ్ముకోవచ్చు కూడా, కాని నా బ్లాగు లక్ష్యం అదికాదు. కేవలం పాఠకులు చదువుకోవడానికి మాత్రమే. అనుమతి లేకుండా కాపీచేయడానికి ఎవ్వరికీ హక్కులేదు. మూర్ఖంగా మాట్లాడితే నేనొప్పుకోను. జనరల్ నాలెడ్జికి కాపీరైట్ ఉండదనుకోవడమూ మూర్ఖత్వమే. బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియాను కాపీచేసి కోర్టుల చుట్టూ తిరిగితే అప్పుడు తెలుస్తుంది. నా బ్లాగు నుంచి కాపీచేసి ఇప్పుడు చిల్లర జనరల్ నాలెడ్జి అంటే కాపీచేసిన వాళ్ళే చిల్లరగాళ్ళు అని ఒప్పుకున్నట్లే. కాపీచేసినప్పుడు గుర్తుకు రాని "చిల్లర" ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? నా బ్లాగులో కేవలం వర్తమాన విషయాలు మాత్రమే ఉండవు. వర్తమాన విషయాలకు సంబంధం ఉన్న జనరల్ నాలెడ్జి సమాచారం కూడా ఉంటుంది. ఇప్పటికైనా మూర్ఖులెవరో తెలుసుకుంటే సరిపోతుంది.
ఇవి కూడా చూడండి ... ఆంధ్రప్రభ వారికి-1,   2

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,