ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 ఫిబ్రవరి, 2012

ఆంధ్రప్రభ పత్రిక వారికి...

చాలా రోజుల నుంచి నా బ్లాగుకు సంబంధించిన చాలా సమాచారం ఎలాంటి అనుమతి లేకుండా కాపీ చేస్తూ మీ పత్రికలో ప్రచురిస్తున్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పత్రిక సైతం ఇప్పుడు ఇలాంటి పని చేయడం ఏమీ బాగాలేదండీ. హెచ్చరిక పెట్టిననూ సమాచారం తీసుకొని కనీసం ఫలానా బ్లాగు నుంచి తీసుకున్నట్లు కూడా వ్రాయలేరు. ఇక్కడి సమాచారం పూర్తిగా నేను స్వయంగా తయారుచేస్తున్నదేనని 4 సంవత్సరాలుగా అంతర్జాల పాఠకులందరికీ తెలుసు. అంతేకాకుండా సమాచారం, శైలి, విధానం మొత్తం మా స్వంతమే. దీనిని ఇంకెవరూ కాపీచేయడానికి వీలులేదు. అనుమతి లేకుండా ఇక్కడి సమాచారం కాపీ చేసుకోవడం చౌర్యం కిందికే వస్తుంది. ఒకటీ, రెండు కాదు వందల సంఖ్యలో  పోస్టులు, వేల ప్రశ్నలను కాపీ చేశారు. ఈ తతంగమంతా చాలా మాసాల నుంచి జరుగుతున్ననూ మీ పత్రికను నేను కానీ మా బంధుమిత్రులు కాని చదవరు కాబట్టి వెంటనే మా దృష్టికి రాలేదు. విషయం తెలిసిన వెంటనే గ్రంథాలయానికి వెళ్ళి గత రెండు సంవత్సరాల సంచికలన్నీ పరిశీలించాను. ఇలా చేయడం దారుణమైన విషయంగా పరిగణిస్తున్నాను. చాలా పోస్టులను నేను ఎలాంటి గ్రంథాలను సంప్రదించకుండా నా 2 దశాబ్దాల అనుభవాన్ని ఉపయోగించి చిటికెలో వేస్తాను. అయిననూ కొన్ని పోస్టులకు సంబంధించి ఒక్కో సారి గంటా రెండుగంటలు సమయం కూడా వెచ్చించిన సందర్భాలున్నాయి. అట్టి సమాచారం ఇప్పటివరకూ ఎక్కడా, ఎవరునూ ప్రచురించలేరు కూడా. గత 20 సంవత్సరాలుగా జనరల్ నాలెడ్జిలో కృషిచేస్తూ ఇదివరకూ ఎవరూ చేయని విధంగా తెలుగులో లక్ష నాణ్యమైన ప్రశ్నలను తయారుచేయాలనే లక్ష్యంలో భాగంగా ఇప్పటికీ 62వేలకు పైగా ప్రశ్నలను తయారుచేశాము. మేము ఇంతగా కష్టపడుతున్నదీ వేరెవరో ఇంత సులభంగా కాపీచేసుకోవడం కోసం కాదన్నది గమనిస్తే బాగుంటుంది. ఎలాంటి పేరూ, అడ్రస్ లేకుండా నా బ్లాగులో రెండుసార్లు కామెంట్ రాశారు. అది ఎవరోకాని బహూశా మీ పత్రికకు సంబంధించినవారై ఉంటారనుకుంటున్నాను. మొదటిసారి కామెంట్‌లో ఈ సమాచారం సొంతంకాదు అన్నారు. ఇక్కడి సమాచారం  తయారుచేసినది నేనే. ఇక్కడి సమాచారంపై నాకు పూర్తి హక్కు ఉంది. అనుమతి లేకుండా మక్కికిమక్కి కాపీ ఎలాచేయగలుగుతారు? రెండోసారి కామెంట్‌లో నా స్టైల్ లో సమాచారం వచ్చినందుకు గర్వపడమంటున్నారు. గర్వపడడానికి పత్రికలో కనీసం నాపేరుకాని, నా బ్లాగుపేరు గాని ఇచ్చారా? ఈర్ష్యపడవద్దంటున్నారు, నేను ఈర్ష్యపడేది ఒక పత్రిక ఇంతగా దిగజారిందా అని! ఇప్పటికైనా ఇలా కాపిచేయడం తప్పేనని ఒప్పుకొని మరోసారి అనుమతి లేకుండా చౌర్యం చేయకుంటే మంచిది. మీకు క్విజ్ ప్రశ్నలు కావాలని కోరితే పాఠకుల దృష్ట్యా వేలకు వేలు ఇంతకంటే నాణ్యమైన ప్రశ్నలు నా జికె ఖజానా నుంచి తీసిఇచ్చేవాడిని. నేను నా బ్లాగులో కాని వికీపీడియాలో కాని కృషిచేస్తున్నది తెలుగు పాఠకుల కొరకేనని అంతర్జాలంలో అందరూ భావిస్తున్నదే. మీరు సమాచారం అనుమతిలేకుండా ఎక్కడినుంచో సేకరించి దొంగతనం కాదు అనుకుంటే మార్కెట్‌లో లభించే పోటీపరీక్షల పుస్తకాల నుంచి ఎందుకు కాపీచేయలేరు? నేను ఎంతో కష్టపడి తయారుచేసిన సమాచారమే మీకు నచ్చినట్లుంది. అలా అనుకున్నప్పుడు ముందస్తుగా నన్ను సంప్రదిస్తే బాగుండేది. జనరల్ నాలెడ్జిలో సొంతకవిత్వం ఊహాత్మక సమాచారం ఉండదు కాని ఒకరు తయారుచేసిన సమాచారం మరొకరు కాపీచేస్తే ఫలితం ఏమిటనేది మీకు చెప్పాల్సిన పనిలేదు. (నా ప్రశ్నలలో పరిశీలనాత్మక, విశ్లేషణాత్మక, తులనాత్మక విషయాలు కూడా ఉంటాయి). ఎవరైనా ఉపయోగించుకొనే వికీపీడీయా లాంటి స్వేచ్ఛావిజ్ఞానసర్వస్వాలలో ఉన్న సమాచారం కూడా కాపీచేసేటప్పుడు "ఫలానా చోటునుంచి తీసుకున్నాము"  అని వ్రాయమని కోరుకుంటున్నాయి. బొమ్మలకైతే దాని అప్లోడ్ చేసిన సభ్యుల పేర్లు ఇవ్వమని కోరుకుంటాయి. మరి నా బ్లాగు స్వేచ్ఛా... కూడా కాదు, పైగా అనుమతి లేకుండా కాపీచేయరాదనే హెచ్చరిక కూడా పెట్టాను. మరి దీనికి మీరు ఏమని సమాధానం ఇస్తారు?
ఇవి కూడా చూడండి... ఆంధ్రప్రభ పత్రికవారికి 2,   3,   4

6 కామెంట్‌లు:

  1. mee blog nunchi patrika varu copy cheyadam chala tappu. (K.Vinay, Hyd)

    రిప్లయితొలగించండి
  2. mee blog chala bagundhani ala cheyadam chala thappu

    రిప్లయితొలగించండి
  3. patrika swecha kaahdu idhi patrika digajarudutahnam idhi vaariki alavatu kadha aina meeru baadha padalsina avasaram ledhu endhukante aaa paper evaru chadhavaru bajjila bandi vaallu kuda aaa paper vadatam ledhu asalu aaa paper okati undhani chala mandhi students ki theliyadhu adhi kevalam librarilaku,konni office laku matrame parimitham plz meeru inka ekkuva prashnalu thayaru cheyalani korukuntunnam thank u

    రిప్లయితొలగించండి
  4. నా బ్లాగుపై చూపిన అభిమానానికి పైవారందరికీ కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. brother mee blog chaala bhaavundi
      meeru chesthunna pani chaala manchidi
      dheeni gurinchi nenu publish chesthaanu
      evaro kondharu ala chesaarani feel avvakandi

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,