- ఇటీవల సాధించిన ఘనత--టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.
- టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు ఇదివరకు ఎవరి పేరిట ఉండేది--వెస్టీండీస్‌కు చెందిన బ్రియాన్ లారా (11953 పరుగులు).
- అత్యధిక పరుగుల రికార్డు టెండుల్కర్ తన ఎన్నవ టెస్టులో సాధించాడు--152వ టెస్టులో.
- సచిన్ టెండుల్కర్ 11953 పరుగుల రికార్డును ఎవరి బౌలింగ్‌లో అధికమించాడు--పీటర్ సిడిల్ (ఆస్ట్రేలియా).
- టెస్ట్ క్రికెట్‌లో సచిన్ టెండుల్కర్ చేసిన అర్థసెంచరీల సంఖ్య--59.
- సచిన్ టెస్టులలో సాధించిన డబుల్ సెంచరీల సంఖ్య--6.
- సచిన్ టెండుల్కర్ ఏ రాష్ట్రానికి చెందినవాడు-- మహారాష్ట్ర.
- టెస్టులలో సచిన్ టెండుల్కర్ సాధించిన సెంచరీల సంఖ్య--39.
- సచిన్ టెండుల్కర్ టెస్ట్ క్రికెట్‌లో తొలి మ్యాచ్ ఏ దేశంతో ఆడినాడు--పాకిస్తాన్.
- టెస్ట్ ఇన్నింగ్సులో సచిన్ టెండుల్కర్ అత్యధిక స్కోరు--248 (నాటౌట్).
(ఈ పోస్టులోని అంశాలు తేది 20-12-2010 నాటికి తాజాకరించబడినవి) |
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి