31 జనవరి 2012

జనవరి 2012-3 (January 2012-3)

  • ఈ ఏడాది పద్మవిభూషన్ అవార్డు ఎందరికి లభించింది-- ఐదుగురికి.
  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగువారి సంఖ్య-- ముగ్గురు.
  • అశోక్ చక్ర అవార్డు ఎవరికి ప్రకటించబడింది-- నవదీప్ సింగ్.
  • భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోరుయాత్ర ప్రారంభించిన గ్రామం-- కృష్ణ (మహబూబ్ నగర్ జిల్లా).
  • ప్రభుత్వంచే నిషేధానికి గురైన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త-- మాధవన్ నాయర్.
  • ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రత్యేక సలహాదారుగా నియమితుడైన భారతీయుడు-- విజయ్ నంబియార్.
  • ఇటీవల వార్తల్లోకి వచ్చిన "రాణి అబ్బక్క" పేరు దేనికి సంబంధించినది-- భారత తీర రక్షణ నౌక.
  • జనవరి 18న మరణించిన మహిళా నాదస్వర కళాకారిణి-- పున్నుతాయ్.
  • ఇటీవల వార్తల్లోకి వచ్చిన భాగ్యం చమురు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది-- రాజస్థాన్.
  • 2012 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు-- ఇంగ్లక్ షినవత్ర (థాయిలాండ్).
ఇవి కూడా చూడండి ... జనవరి 2012-1,   2,   4
విభాగాలు:  2012,

30 జనవరి 2012

సూర్యభగవానుడు (Surya)

(రథసప్తమి సందర్భంగా)
  • సూర్యభగవానుడు ఎవరి కుమారుడు-- అదితి, కశ్యప మహర్షి.
  • సూర్యుడి జన్మవృత్తాంతం ఉన్న పురాణం-- భవిష్య పురాణం.
  • సూర్యభగవానుడి ప్రాముఖ్యతను వివరించే వేదం-- అధర్వణ వేదం (సూర్యోపనిషత్తు).
  • అరాణ్యవాస సమయంలో సూర్యుడిచే అక్షయపాత్ర పొందిన పాండవుడు-- ధర్మరాజు.
  • సూర్యభగవానుడి రథానికి ఉండే గుర్రాల సంఖ్య-- 7.
  • సూర్యభగవానుడు జన్మించిన దినం-- రథసప్తమి.
  • పురాణాల ప్రకారం సూర్యుడు ఏ పర్వతం చుట్టూ ప్రయాణిస్తాడు-- మేరు పర్వతం.
  • సూర్యుడు ఏ మంత్రానికి అధిపతి-- గాయత్రి మంత్రం.
  • ఒరిస్సాలో ప్రముఖ సూర్యదేవాలయం ఎక్కడ కలదు-- కోణార్క్.
  • ఆంధ్రప్రదేశ్‌లో సూర్యదేవాలయం ఉన్న క్షేత్రం-- అరసవల్లి (శ్రీకాకుళం జిల్లా).
విభాగాలు: హిందూమతము

29 జనవరి 2012

బాసర (Basara)

  • బాసర పుణ్యక్షేత్రం ఏ జిల్లాలో ఉన్నది-- ఆదిలాబాదు జిల్లా.
  • బాసరలో ఉన్న ప్రముఖ దేవాలయం-- సరస్వతీ దేవాలయం.
  • బాసర ఏ మండలంలో ఉంది-- ముధోల్ మండలం.
  • బాసరలో సరస్వతీ దేవిని ప్రతిష్టించినది-- వ్యాసమహర్షి.
  • బాసర అసలు నామం-- వాసర (తర్వాత వ్యాసర).
  • ఎవరి పేరుమీదుగా వ్యాసర పేరు వచ్చింది-- వ్యాసుడు.
  • బాసర ఏ నది తీరాన ఉంది-- గోదావరి నది.
  • బాసర సరస్వతీ దేవాలయం ప్రత్యేకత-- ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక జ్ఞానసరస్వతీ దేవాలయం (ప్రముఖ గ్రంథాల ప్రకారం).
  • బాసర రైల్వేస్టేషన్ ఏ మార్గంలో ఉంది-- సికింద్రాబాదు నుంచి మన్మాడ్ సెక్షన్‌లో.
  • బాసరలో ధ్వంసమైన దేవాలయాన్ని పునర్మించిన భక్తుడు-- మక్కజ్‌పట్.

యానాం (Yanam)

  • యానాం ఏ కేంద్రపాలిత ప్రాంతంలో భాగము-- పుదుచ్చేరి (పాండిచ్చేరి).
  • యానాం ఏ నదీ డెల్టాలో ఉన్నది-- గోదావరి నది.
  • యానాం ఏ సముద్రతీరాన ఉంది-- బంగాళాఖాతం.
  • భౌగోళికంగా యానాం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో ఉంది-- తూర్పు గోదావరి జిల్లా.
  • యానాం సమీపంలోని నగరము-- కాకినాడ.
  • యానాం భారతదేశంలో ఎప్పుడు విలీనమైంది-- 1954.
  • 1954కు ముందు యానాం ఎవరి అధీనంలో ఉండేది-- ఫ్రెంచి
  • యానాంను ఫ్రెంచివారు ఎప్పుడు ఆక్రమించారు-- 1723.
  • యానాం సమీపంలోని వన్యమృగ సంరక్షణ కేంద్రం-- కోరింగ.
  • యానాం గుండా వెళ్ళు జాతీయ రహదారి-- NH-214.
విభాగాలు:  పుదుచ్చేరి,   గోదావరి నది,   1954,  

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.