ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 నవంబర్, 2016

రాజకీయాలు కాదు దేశం గురించి ఆలోచించండి


అధ్యాత్మికంగా, చారిత్రకంగా, భౌగోళికంగా సుసంపన్నమైన మన భారతదేశం స్వాతంత్ర్యం లభించి సుమారు 7 దశాబ్దాలు గడిచిననూ అన్ని వనరులున్ననూ ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడాన్ని ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. గత 7 దశాబ్దాలుగా తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, ఓటు రాజకీయాలు దేశాన్ని ఈ దురవస్థ దశకు తీసుకువచ్చాయనేది ఆర్థికవేత్తల అభిప్రాయాలను కొట్టిపారేయలేము. ఏ నిర్ణయం తీసుకుంటే ఓట్లకు గండిపడుతుందో అనే అనుమానంతో దేశప్రయోజనాల దృష్ట్యా తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకులేకపోయారు. ఆర్థికవ్యవస్థ కుళ్ళిపోయినా ఫరవాలేదు, దేశప్రజలను బుజ్జగించి ఓట్లు పొందడమే ప్రధానాశయంగా ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థికవ్యవస్థను దారుణంగా దెబ్బతీశాయి. ఇన్నేళ్ళ తర్వాత ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇటీవల తీసుకున్న సాహసోపేత ఆర్థిక నిర్ణయాలు దేశ ఆర్థికరంగాన్ని తప్పకుండా మార్పులకు గురిచేసి భవిష్యత్తులో బలమైన ఆర్థికశక్తికల దేశంగా మారుస్తుందనడంలో సందేహంలేదు. మొక్క నాటగానే ఫలాలు ఆశించడం ఎంత మూర్ఖత్వమో నిర్ణయం తీసుకోగానే ప్రతిఫలాలు ఆశించడం అంతకన్నా పొరపాటు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలనే పణంగా పెట్టి, బ్రిటీష్ వారి లాఠీదెబ్బలు తిని, జైళ్ళలో కఠినశిక్షలు అనుభవించిన ఘోరాతిఘోరమైన దారుణాల ముందు బ్యాంకులలో క్యూలలో నిలబడడం ఏ మాత్రం లెక్కలోకి తీసుకోవాల్సిన విషయం కానేకాదు. చిల్లర దొరకడం లేదని చిల్లర రాజకీయాలు చేయడం కంటే దేశం కోసం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు వివరించి వారికి అండగా నిలబడే అవసరం లేదా? సాహసోపేతమైన నిర్ణయాలతో దేశ ఆర్థికవ్యవస్థ మొత్తం మార్పుచెంది చిన్న దేశాలు సైతం ప్రపంచ ఆర్థికపటంలో వెలుగులు విరజిమ్ముతుంటే ఆహా అని అంటాం కాని, మన ప్రభుత్వమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే విమర్శించడం , ప్రజలను రెచ్చగొట్టడం ఎంతవరసి సబబో ఆలోచించండి. 70 సంవత్సరాల అవినీతి జాడ్యాన్ని ఒక్కరోజులో నిర్మూలించలేము. స్వయానా ప్రధానమంత్రే 50 రోజుల పాటు ఓపికపట్టండి, చిన్న చిన్న ఇబ్బందులున్నా భరించండి అని విన్నవించినా చిల్లర రాజకీయాలకు అలవాటుపడిన వారు అర్థం చేసుకోవడం లేదు లేదా వారి స్వార్థ ప్రయోజనాలే ఆలోచిస్తున్నారు. మోడి తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యాశయం సరిహద్దు దేశాల నుంచి వరదలా వస్తున్న నకిలీ కరెన్సీని అడ్డుకోవడం మరియు సంచులకొద్దీ ఉన్న నల్లధనాన్ని వెలికితీసి దేశ ఆర్థికవ్యవస్థను సుసంపన్నం చేయడమే కాని సామాన్య ప్రజలను క్యూలలో నిలబెట్టి ఇబ్బందులకు గురిచేయడం కాదు. మేధావులు, విద్యావంతులు, దేశభక్తులు, విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయాన్ని అర్థం చేసుకొని మద్దతు పలుకుతున్నారు. ఇలాంటి వారు సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పి, వారి ఇబ్బందులు స్వల్పకాలమే నని భవిష్యత్తులో సామాన్యప్రజలకే మేలు జరుగుతుందని వివరించడం మనందరి బాధ్యత. తాత్కాలిక ఇబ్బందులు కాదు, దేశ భవిష్యత్తే మనకు ముఖ్యం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents