తెలుగులో జికె ( /telugulogk) ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి పేజీకి ఐదువేల అభిమానులు పూర్తయిన శుభసందర్భంలో ఈ ఫేస్‌బుక్ జికె పేజీ అభిమానులకు, వీక్షకులకు, మిత్రులకు అందరికీ శుభాభివందనములు. ఫోటోల రూపంలో రోజూ ప్రచురిస్తున్న జికె పోస్టులకు రోజూ వేలాది అభిమానులు వీక్షించడమే కాకుండా క్లిక్కులు చేసి, లైకులు కొట్టి, షేర్లు చేసి మమ్ముల్ని ఉత్తేజపరుస్తున్న ఈ పేజీ అభిమానలోకానికి ప్రత్యేక అభినందనలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వారే కాకుండా అమెరికా, అరబ్ ఎమిరేట్స్, కువైట్, సింగపూర్, బహరీన్, ఓమన్ తదితర దేశాల తెలుగువారు కూడా ఈ పేజీ అభిమానులేనని గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ పేజీ అభిమానులలో ఎక్కువగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వయస్సువారున్ననూ అధ్యాపకులు, కశాళాల ఆచార్యులు, వివిధ కార్యాలయాలలో పనిచేస్తున్న ఉన్నతోద్యోగులు, పదవీ విరమణ పొందిన వారు, వివిధ రంగాలలోని నిపుణులు కూడా ఉన్నారు. 65+ వయస్సుదాటిన వారు కూడా ఈ పేజీ అభిమానులుగా ఉన్నట్లుగా ఇన్‌సైట్ గణాంకాలు విశదపరుస్తున్నాయి. నగరాల వారీగా చూస్తే అత్యధికంగా హైదరాబాదు ప్రథమస్థానంలో ఉండగా ఆ తర్వాత కరీంనగర్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం, బెంగుళూరు, వరంగల్, కర్నూలు, దుబాయ్, కువైట్, నిజామాబాద్, ఖమ్మం, అనంతపురం, రియాద్, సింగపూర్, కాకినాడ, నెల్లూరు, జగిత్యాల, నల్గొండ, మామడ, కడప, తిరుపతి, చెన్నై, సిద్ధిపేట్, శ్రీకాకుళం, రాజమండ్రి, మంచిర్యాల, మహబూబ్‌నగర్, ఒంగోల్, అబూదాబి, భీమవరం, కొత్తఢిల్లీ, ముంబాయి, దోహ, ఆదిలాబాదు, హన్మకొండ, తణుకు, ఏలూరు, గుంతకల్లు, చిత్తూరు తదితర నగరాలు ఈ క్రమంలో వస్తాయి. ఈ పేజీకి అభిమానులే సంపద, అలాంటి అభిమాన సంపదను మరింతగా వృద్ధిపర్చడానికి ప్రస్తుత అభిమానులు మరికొందరికి ఈ పేజీని కొత్తవారికి పరిచయం చేసి, అతిత్వరలో పేజీ అభిమానుల సంఖ్యను ఐదువేల నుంచి ఐదంకెల సంఖ్యకు పెంచడానికి తోడ్పడతారని ఆకాంక్షిస్తూ, ఈ జికె పేజీ నిర్వహణలో మాకు ప్రోత్సాహమిస్తూ, తెలుగు జికె పేజీలలో అగ్రస్థానాన్ని ఉంచుతూ, విధ్యార్థిలోకానికి గరిష్టస్థాయిలో ఈ పేజీని ఉపయోగించుకోవడానికి వీలుగా అభిమానులు ఇదే విధంగా మాకు సహకరిస్తారని ఆశిస్తూ... సదా మీ సేవలో... ... సి.చంద్రకాంతరావు. (www.facebook.com/chandrakanthrao.c.9) |
10 మార్చి, 2015
ఐదువేల అభిమాన సంపద
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
విషయసూచిక
శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,
ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.