అంతర్జాలంతో పరిచయమున్న ప్రతిఒక్కరికి వికీపీడియా పేరు సుపరిచితమే. ఇది ఉచితంగా లభ్యమయ్యే అనంతమైన విజ్ఞాన సమాచారాన్ని అందించే భాండాగారమని కూడా చాలా మందికి తెలుసు. వికీపీడీయా అనేది కేవలం ఆంగ్లభాషకే పరిమితం కాదని ప్రపంచంలోని ముఖ్యమైన భాషలన్నింటికీ ఇది వ్యాపించియున్నదనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. 274 భాషా వికీలలో తెలుగు వికీపీడియా (తెవికి) అనేది కూడా ఒకటని, ఇది భారతీయ భాషలలోనే ఒక ప్రత్యేకత కలిగియున్నదనే విషయం కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. దాదాపు పదేళ్ళ క్రితం ప్రారంభమై, క్రమక్రమంగా వృద్ధి చెందుతూ నేడు 53వేలకు పైగా వ్యాసాలతో, 9వేలకు పైగా బొమ్మలతో విలువైన విజ్ఞానపు సంపదను కలిగియుంది. 32వేలకు పైగా సభ్యులు ఇందులో నమోదయ్యారంటే నమ్మశక్యం కాకపోవచ్చు, వారందరూ దిద్దుబాట్లు చేయకపోవచ్చు, కాని దాదాపు 600 సభ్యులు (5 కంటె ఎక్కువ దిద్దుబాట్లు చేసినవారు) అజ్ఞాతంగా రచనలు చేసే మరెందరో సభ్యులమూలంగా తొమ్మిదిన్నర లక్షల దిద్దుబాట్ల ద్వారా ఈ సంపదపోగు పడిందని చెప్పడం తెలుగు వారికే గర్వకారణం. అయితే మనం దీనికే గర్వపడే అవసరం లేదు, ఈ సంపదను మరింతగా పెంచాలి, నాణ్యతను పెంచాలి, మరిన్ని చురుకైన సభ్యులు రచనలు చేయాలి, బ్లాగులలో తెలుగులో రచనలు చేసే ప్రతిఒక్కరు తమకు తెలిసిన గ్రామ, మండల, జిల్లా వివరాలను పరిపుష్టం చేయాలి. తమకు తెలిసిన విజ్ఞానాన్ని తెవికీలో చేర్చి తెలుగు ప్రజలకందరికి అందుబాటులో ఉండేట్టు చేయాలి. ప్రపంచంలో మనకంటే తక్కువ సంఖ్యలో మాట్లాడే భాషలు మనకంటే ముందంజలో ఉండటం కాకుండా మనమే ముందుకు పయనించేట్టు ప్రయత్నించాలి. ఇది ఏ ఒక్కరి వల్లనో జరిగే పని కాదు, ఏ ఒక్క రోజుతో పూర్తయ్యే కార్యం కాదు. కాని తెలుగు ప్రజలు పూనుకుంటే జరుగని పని అంటూ కాదు. కాబట్టి ఇప్పుడే ప్రయత్నించండి, తెవికీలో ప్రవేశించండి, రచనలుచేయండి, తెలుగు విజ్ఞానసర్వస్వము అనే బృహత్కార్యంలో మీరూ భాగస్వాములుకండి. తెవికీలో కృషిచేస్తే మనకు డబ్బు లభించకపోవచ్చు కాని అంతకంటే విలువైన తెలుగు ప్రజల ఆదరాభిమానాలు, తెలుగు వారికి సేవ చేస్తున్నామన్న సంతృప్తి కంటే మనకు విలులైనదేమిటి? మీరూ ఆలోచించండి. తెవికీ ప్రచారం కొరకే ప్రత్యేకంగా నేను "తెలుగు వికీపీడియా నిర్వహణ బ్లాగు"ను ప్రారంభించాను. ఎప్పటికప్పుడు తెవికీ గురించి తెలుగు బ్లాగులోకానికి, తెలుగు బ్లాగు అభిమానులకు తెలియజేయడమే దీని ఉద్దేశ్యం.ఇందులోని విషయాల గురించి మీరు ఆ బ్లాగులోనే తెలుసుకోవచ్చు. |
27 అక్టోబర్, 2013
తెలుగు వికీపీడియా నిర్వహణ బ్లాగు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
విషయసూచిక
శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,
ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు, |
చాలా మంచి ప్రయత్నం!
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు
తొలగించండి