ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 మార్చి, 2012

ఆంధ్రప్రభ పత్రికా...... మీకిది తగునా?

చాలా కాలం పాటు నా బ్లాగులోని విషయాలు కాపీ చేసుకొని మక్కికిమక్కిగా మీ పత్రికలో ప్రచురించుకున్న నా జనరల్ నాలెడ్జి ప్రశ్నలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సరైన సమాధానం లేదు. పైగా భయపెట్టించడం, హేళనపర్చడం లాంటివి చేయడం మీకిది తగునా? నా బ్లాగు నుంచి ప్రశ్నలను కాపీచేసుకొని ప్రచురించుకొని ఇప్పుడు నా బ్లాగులో పెట్టిన హెచ్చరికను కూడా తొలిగించాలని చెప్పడం ఎక్కడి న్యాయమండి? ఎలాంటి అనుమతి లేకుండా, కనీసం నా బ్లాగు నుంచి తీసుకున్నట్లు కూడా తెలుపకుండా ఇలాంటి చిల్లరపనులు చేసి ఇప్పుడు నా బ్లాగు చిల్లర బ్లాగు అనడం ఎంతవరకు సమంజసమండీ? పత్రికవారికి కూడా జర్నలిజం, కాపీరైట్ హక్కులు గురించి కొత్తగా నేర్పించాలా? ఎలాంటి అనుమతి లేకుండా మక్కికిమక్కి కాపీ చేయడం తప్పేనని చిన్నపిల్లవానికి కూడా తెలుసు, అదీ మీకు నేర్పించాలా? వికీపీడియా గురించి వివరిస్తారు అసలు వికీపీడియా గురించి మీకు తెలుసా? అది స్వేచ్ఛావిజ్ఞాన సర్వస్వమైననూ అక్కడి నుంచి కాపీచేసిన వ్యాసాలకు కూడా "వికీపీడియా సౌజన్యం" అని వ్రాయాల్సి ఉంటుంది. నాబ్లాగు స్వేచ్ఛా విజ్ఞాస సర్వస్వం కూడా కాదు, పైగా అనుమతిలేకుండా కాపీ చేసుకోరాదనే హెచ్చరిక కూడా ఉంది. ఎవరో అనామకవ్యక్తి తెలియకుండా కాపీ చేసుకోవడం వేరు ఒక పత్రిక వారు కాపీ చేయడం వేరు. ఇదివరకు కొన్ని బ్లాగులు, వెబ్‌సైట్లు కూడా నా విషయాన్ని కాపీ చేసుకున్ననూ నా దృష్టికి రాగానే వారికి తెలియజేసిన వెంటనే సమాచారం తొలిగించివేశారు. ఎన్నో బ్లాగులు, వెబ్‌సైట్లు నా బ్లాగుకు లింకులిచ్చారు. వారందరికీ కృతజ్ఞతలు. విజ్ఞానం ఒకరి సొంతు కాదు కాని కనిపించింది కాపీచేసుకోవడం అన్యాయం, అక్రమం, అమానుషం, దారుణం. ఆ మాత్రం జనరల్ నాలెడ్జి ప్రశ్నలు తయారుచేయడం మీకు రాదా? నా బ్లాగులోని ప్రశ్నలన్నీ నాదైన శైలిలో తయారుచేసినవే. కొన్ని పోస్టులలోని విషయాలు ఇదివరకు ఎక్కడా, ఎవరునూ ప్రచురించలేదు కూడా. ఇవన్నీ మక్కికిమక్కి చేసుకోవడం పత్రికావిలువలను తుంగలో తొక్కినట్లే.
ఇవి కూడా చూడండి ... ఆంధ్రప్రభ వారికి-1,   2,   3,

12 కామెంట్‌లు:

  1. ఈ విషయాన్ని మీరు తేలిగ్గా తీసుకోకండి. ఆంధ్రప్రభ మీద దావా వెయ్యండి. ఆ విషయాన్ని ఇతర పత్రికలకూ, టివిలకూ తెలియపరచండి. ఇలా అయినా సరే మన బ్లాగుల తడాఖా ఏంటో అందరికీ తెలియజెప్పండి. అందువల్ల మీకూ, బ్లాగులకూ ప్రచారమూ వస్తుంది, మీకు న్యాయమూ జరుగుతుంది.

    రిప్లయితొలగించండి
  2. అవునండి శరత్ గారు, బ్లాగులంటే చులకనగా చూసేవారికి మీరిచ్చే సమాధానం చాలా బాగుంది. మన బ్లాగర్లు మామూలు వ్యక్తులు కారు, పత్రికలకు బ్లాగులు ఏ మాత్రం తీసుపోవని ఇదివరకే కొన్ని ప్రముఖ పత్రికలు కూడా రాశాయి. మరి మా సమాచారం ఇంత తేలికగా కాపీ చేసుకోవడం ఎలా ఒప్పుకుంటాము. ఇంతకు క్రితం ఒక బ్లాగులోని జోక్స్ కూడా ఒక పత్రిక వారు ప్రచురించుకున్నారు. కనీసం బ్లాగుపేరు, రచయిత పేరు కూడా ఇవ్వలేరు. ఈ విషయంలో మనం జాగరూకత వహించాలి, అవసరమైతే బ్లాగు నియమావళిని రచించుకొని పత్రికలను తెలియజేయాలు. ధన్యవాదాలతో...

    రిప్లయితొలగించండి
  3. Do not be content by publishing your protest in your blog. Please ensure that a Legal Notice is issued to the Editor and Publisher of Andhra Prabha.

    If no satisfactory reply comes file a suit in Civil Court in your Town or City and see that summons are issued to Andhra Prabha.

    Let the papers do not think that they can just like that lift material from blogs and publish without even giving credit to the person who originally wrote or collected them.

    రిప్లయితొలగించండి
  4. Please do not be content with publishing your protests in your blog. Ensure that a Legal Notice is sent to the Editor and Publisher of Andhra Prabha.

    If no reply comes file a Civil Suit in your town/city against Andhra Prabha.

    రిప్లయితొలగించండి
  5. మీక్కూడా ఈ దరిద్రం తగిలినందుకు చింతిస్తూనే, మీరిలా ఈ విషయాన్ని బట్టబయలు చెయ్యడాన్ని హర్షిస్తున్నా.
    బ్లాగులంటే చలివేంద్రాలు కావు, పత్రికల వాళ్ళు దాహం వేసినప్పుడల్లా వచ్చి, ఒక గ్లాసు తాగి పోవడానికి!

    రిప్లయితొలగించండి
  6. శివరామ ప్రసాద్ మరియు నారాయణస్వామి గార్లకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  7. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆంద్ర ప్రభ ప్రభ ఇప్పుడు పేరు మాత్రమే పాతది . బ్లాగ్స్ నుంచి కాపి కొట్టడం తప్ప రాసే వాళ్ళు దిక్కులేని పత్రిక అయింది. మీరు ఒక సారి హెచ్చరించిన తరువాత కూడా సిగ్గు లేకుండా సమర్ధించుకోవడం మరింత దౌర్భాగ్యం . ఒకప్పుడు శ్రీ శ్రీ , వేటూరి లాంటి మహ నీయులు సబ్ ఎడిటర్ లుగా పని చేసిన గొప్ప పత్రిక ఇలా అయినందుకు బాధగా ఉంది

    రిప్లయితొలగించండి
  8. మీరు పేరు లేకుండా కామెంట్ రాశారు కాని మీ వ్యాఖ్య బాగుంది. కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  9. ఈ పత్రిక ఇంకా బ్రతికి ఉందని మీ బ్లాగు ద్వారానే తెలిసింది,కానీ ఇటువంటి చేష్టలతో తన గతకాలపు ప్రభను తానే స్వయంగా కాలరాస్తోందని ఆ పత్రికకు తెలియకపోవడం శోచనీయం. మీకు నా మద్దతు.

    రిప్లయితొలగించండి
  10. paper vallaku permission adagadam namoshina?


    Jonna Prabhakar, Peddapalli, Karimnagar Dist.

    రిప్లయితొలగించండి
  11. ఒకప్పటి గొప్ప పత్రిక (ఇప్పుడు మాత్రం కాదప్పా) ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తుందా ! పర్మిషన్ తీసుకుంటే సరిపోయేది, అట్లా చేయడంకు మనస్సు ఒప్పుకోలేదా, మల్ల ఇట్లా దొంగతనం లాగా పనులు ఎందుకబ్బా.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,