10 మే, 2010

గవర్నరు (Governor)

  • ఇటీవల సుప్రీంకోర్టు గవర్నరు వ్యవస్థపై ఇచ్చిన సంచలనాత్మక తీర్పు--గవర్నర్లను కేంద్రం బలమైన కారణం లేనిదే మార్చరాదు.
  • గవర్నరుగా నియమితులవడానికి ఉండవలసిన కనీస వయస్సు--35 సం.లు.
  • గవర్నరుకు మరోపేరు--రాజ్‌పాల్.
  • ఒకే వ్యక్తి రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నరుగా నియమించవచ్చునని ఏ సవరణ ద్వారా మార్పు చేయబడినది--7వ రాజ్యాంగ సవరణ.
  • గవర్నరుకు క్షమాభిక్ష అధికారం కల్పించే అధికరణం--161.
  • రాష్ట్ర గవర్నరు ఎవరికి బాధ్యత వహిస్తాడు--రాష్ట్రపతికి.
  • మనదేశంలో తొలి మహిళా గవర్నరు--సరోజినీ నాయుడు.
  • గవర్నరు నివాస భవనం--రాజ్‍భవన్.
  • ఏ రాజ్యాంగ ప్రకరణ ప్రకారం గవర్నరు నియమితుడౌతాడు--157.
  • విధానపరిషత్తులో (ఉన్నచో) గవర్నరుచే నామినేట్ చేయబడు సభ్యుల సంఖ్య--మొత్తం సభ్యుల సంఖ్యలో 6వ వంతు.
విభాగాలు: భారత రాజ్యాంగము,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.