1 ఆగస్టు, 2010

తన్నీరు హరీష్ రావు (T.Harish Rao)

  • హరీష్‌రావు ఎందువలన వార్తల్లోకి వచ్చారు--అసెంబ్లీ ఉప ఎన్నికలలో రికార్డు మెజారిటీతో గెలుపొందినారు.
  • హరీష్‌రావు 2010 జూలై ఉప ఎన్నికలలో ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు--సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గం.
  • హరీష్‌రావు ఏ పార్టీకి చెందినవారు--తెలంగాణ రాష్ట్ర సమితి.
  • కె.చంద్రశేఖర్ రావుకు హరీష్‌రావుకు బంధుత్వం--కెసిఆర్ మేనల్లుడు.
  • హరీష్‌రావు 95వేలకు పైగా మెజారిటీ సాధించి ఎవరి రికార్డును అధికమించాడు--వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రికార్డును.
  • హరీష్‌రావు ఏ జిల్లాకు చెందినవారు--కరీంనగర్ జిల్లా.
  • హరీష్‌రావు ఇప్పటివరకు ఎన్నిసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు--4 సార్లు.
  • హరీష్‌రావుకు ముందు సిద్ధిపేట నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించిన నాయకుడు--కె.చంద్రశేఖర్ రావు.
  • ఇటీవలి సిద్ధిపేట ఉప ఎన్నికల ఫలితాల మరో ప్రత్యేకత--ప్రత్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు.
  • హరీష్‌రావు తొలిసారి శాసనసభకు ఎప్పుడు ఎన్నికయ్యారు--2004.
విభాగాలు: వ్యక్తులు, రాజకీయాలు, తెలంగాణ రాష్ట్ర సమితి, కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.