- శశి థరూర్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు--కేంద్ర మంత్రిపదవికి రాజీనామా చేశారు.
- శశి థరూర్ మంత్రిపదవికి రాజీనామా చేయుటకు కారణమైన ప్రధానమైన ఆరోపణ--తన సన్నిహితురాలు సునందకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కోచి ఫ్రాంఛైజీలో రూ.70 కోట్ల ఉచిత వాటా ఇప్పించాడనే ఆరోపణ.
- శశి థరూర్ కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించిన మంత్రిత్వ శాఖ--కేంద్ర విదేశాంగ శాఖా సహాయమంత్రి.
- 2006లో శశి థరూర్ భారత ప్రభుత్వం తరఫున ఏ అంతర్జాతీయ సంస్థ అధిపతి పదవికి పోటీచేయడానికి నామినేట్ చేయబడ్డాడు--ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవికి.
- 2009 లోకసభ ఎన్నికలలో శశి థరూర్ ఏ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు--త్రివేండ్రం (తివనంతపురం) లోకసభ నియోజకవర్గం.
- శశి థరూర్ లోకసభకు ఏ పార్టీ తరఫున ఎన్నికయ్యారు--కాంగ్రెస్ పార్టీ.
- 2009 లోకసభ ఎన్నికలలో శశి థరూర్ సమీప ప్రత్యర్థి--పి.రామచందన్ నాయర్ (సిపిఐ).
- ట్విట్టర్‌లో శశి థరూర్ సాధించిన ఘనత--లక్ష అనుచరులను సంపాదించిన తొలి భారతీయుడు.
- శశి థరూర్ రచించిన ప్రధాన గ్రంథం--ది గ్రేట్ ఇండియన్ నావెల్.
- శశి థరూర్ యొక్క వివాదాస్పద వ్యాఖ్య--ఎకానమీ క్లాసులో ప్రయాణించడమంటే గొర్రెల మందతో కలిసి ప్రయాణించడం.
|
వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు. |
రాజకీయాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాజకీయాలు. |
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>కాంగ్రెస్ పార్టీ. |
2010 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2010. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.