- బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దేనికి సంబంధించినది--కృష్ణానది జలాల పంపకంకై ఏర్పాటుచేసిన ట్రిబ్యునల్.
- బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేశారు--2004 ఏప్రిల్.
- కృష్ణా జలాల పంపిణీకై ఏర్పాటుచేసిన ట్రిబ్యునల్‌లలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎన్నవది--రెండవది.
- బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కంటె ముందు కృష్ణా జలాల పంపిణీపై తీర్పు ఇచ్చిన ట్రిబ్యునల్--బచావత్ ట్రిబ్యునల్.
- బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానదిలో సరాసరి నీటిలభ్యత--2578 టీఎంసీలు.
- బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఎప్పటివరకు అమలులో ఉంటుంది--2050 మే 31.
- అలమట్టి ప్రాజెక్టు ఎత్తును ఎంతమేరకు పెంచేందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంగీకరించింది--524.25 మీ.
- బచావత్ ట్రిబ్యునల్ కంటె బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అధికంగా లెక్కవేసిన అదనపు జలపరిమాణం-448 టీఎంసీలు.
- బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అమలుచేయడానికి ఏర్పాటుచేయనున్న బోర్డు--కృష్ణా నీటి నిర్ణయ అమలు బోర్డు (KWDIB).
- బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన గరిష్ట నీటి వినియోగం--1001 టీఎంసీలు.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి