(తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా) - ఎవరి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు--గిడుగు రామమూర్తి.
- దేశభాషలందు తెలుగు లెస్స అని వ్యాఖ్యానించినది--శ్రీకృష్ణదేవరాయలు.
- తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పలికినది--నికోలోకొంటి.
- తెలుగు భాషోద్ధారకుడు అని ఎవరినందురు--సి.పి.బ్రౌన్.
- ప్రపంచ భాషలలో తెలుగు భాష మాట్లాడేవారి స్థానం--16వ.
- తెలుగులో మొట్టమొదట రాజశాసనాలు వేయించిన రాజులు--రేనాటి చోళులు.
- తెలుగు భాషను జెంతూగా పిలిచినవారు--పోర్చుగీసు వారు.
- తెలుగు లిపిలో రచించిన మొట్టమొదటి శాసనం--విప్పర్ల శాసనం.
- ఆంధ్రరాష్ట్ర తొలి శాసనసభలో తెలుగు పరిపాలన భాషగా ఊండాలని తీర్మానం ప్రవేశపెట్టినది--వావిలాల గోపాలకృష్ణయ్య.
- మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు నిర్వహించబడ్డాయి--1975.
|
|
విభాగాలు: ప్రముఖ దినోత్సవాలు, |
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి